Showing posts with label nizam sagar project. Show all posts
Showing posts with label nizam sagar project. Show all posts

Saturday, September 4, 2010

NIZAM SAGAR PROJECT | NIZAMSAGAR NIZAMABAD DISTRICT




నిజామాబాదు జిల్లా వరదాయని ఎన్నో ఎల్ల చరిత్ర గల నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిండు కుండల పూర్తీ స్తాయి నీటి మట్టం తో నిండు కుండల కనువిందు చేస్తుంది, 2 సంవస్చారాల తరువాత మల్లి ప్రాజెక్ట్ పూర్తీ స్తాయి నీటి మట్టం తో కల కల లాడుతోంది, ప్రాజెక్ట్ నిండటం తో నిజాం సాగర్ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆయకట్టు ప్రజల అవసరాల మేరకు ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల కొనసాగుతుంది, ప్రాజెక్ట్ జల విద్యుతుత్పత్తి కేంద్రం టర్బైన్ల ద్వారా 1600 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల చేస్తున్నారు.
గడిచిన ఆదివారం 14 గేట్ల ద్వారా నీటిని మంజీరా నదిలోకి వదిలారు, వారం చివరి రోజులైనా శని వారం , ఆది వారం ప్రాజెక్ట్ పర్యాటకులతో కనువిందు చేస్తుంది
ప్రాజెక్ట్ పూర్తీ స్తాయి నీటి మట్టానికి చేరుకోవడం తో గురు వారం అర్దరాత్రి ప్రాజెక్ట్ 4 గేటు ను అధికారులు ఎత్తివేసారు, శుక్ర వారం ఉదయం 6 గంటల వరకు గేటు ను ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువ కాలువకు వదిలారు. ప్రస్తుత్రం నీటి మట్టం నిలకడ ఉండటం తో గేటు ను మూసివేసారు. ప్రస్తుతం నిజాం సాగర్ నీటి మట్టం 1405.5 అడుగుల తో 17.8 టి ఎం సి లు ఉంది .